నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.