రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు సెలబ్రిటీలు ఏపీ నుంచి వెళ్లారు. కానీ ఈ పెళ్లికి వైసీపీ అధినేత జగన్ కనిపించలేదు. అంబానీ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నవారికి మాత్రమే ఆహ్వానాలు అందాయని ప్రచారం జరుగుతోంది. మరి ముకేష్ అంబానీ.. వైఎస్ జగన్‌ను పెళ్లికి పిలిచారో? లేదో? తెలియదు.