టీడీపీకి చెంగల్రాయుడు రాజీనామా

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పార్టీకి రాజీనామా చేశారు. కడప జిల్లా రాజంపేటలో తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, చెంగల్రాయుడు రాజంపేట టీడీపీ టికెట్‌ ఆశించారు. అయితే తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు శనివారం చెంగల్రాయుడు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్