శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని అనపర్తి సీఐ సుమంత్ అన్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లు, పాత నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుమంత్ మాట్లాడుతూ రౌడీషీటర్లు, పాత నేరస్తులు ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దన్నారు. తమ సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీను నాయక్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్