మామిడికుదురు: మద్యం షాపును తొలగించాలని మహిళల నిరసన

79చూసినవారు
మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం బొమ్మిడిపాలెంలో నివాస గృహాల మధ్య ఉన్న మద్యం షాపును తొలగించాలని స్థానికులు మంగళవారం డిమాండ్ చేశారు. నివాస గృహాల మధ్యలో మద్యం షాపు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస గృహాలకు దూరంగా షాపును తరలించాలని, దీనిపై కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. రాజోలు ఎక్సైజ్ సీఐ వీరబాబు వద్ద నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్