6 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని స‌ర్కార్ నిర్ణయం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. సీఎంగా చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలతో పాటు YSR హెల్త్ వర్సిటీ పేరు NTR హెల్త్ వర్సిటీగా మార్పునకు పచ్చ జెండా ఊపింది. 6 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్