పాణ్యం: గాలేరు, నగరి కాల్వలో కొట్టుకుపోయిన గేదెలు

పశుగ్రాసానికి వెళ్లిన గేదెలు నీరు తాగేందుకు గాలేరు, నగరి కాల్వలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బుధవారం పాణ్యం మండలం సుగాలిమెట్ట సమీపంలో 22 గేదెలు కాల్వలోకి దిగాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయాయి. గమనించిన రైతులు రామతీర్థం, యనకండ్ల వద్ద అతి కష్టం మీద 10 బర్రెలను బయటకు తీశారు. పాడి రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కాల్వలో ప్రవాహాన్ని 5 వేల నుంచి 3 వేల క్యూసెక్కులకు తగ్గించారు.

సంబంధిత పోస్ట్