సముద్రంలో వివాహిత సాహసయాత్ర

AP: ఐదు పదుల వయసులో ఓ వివాహిత సముద్రంలో సాహసయాత్రకు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల గోలి (51) విశాఖ నుంచి సముద్రంలో ఈదుకుంటూ 150 కి.మీ. దూరంలో ఉన్న కాకినాడ చేరుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో అనారోగ్యానికి గురైన శ్యామల.. శ్రేయోభిలాషుల సూచనతో ఈత నేర్చుకున్నారు. ఈతపై పట్టు సాధించడంతో సాహసయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత పోస్ట్