కర్నూలు: ఇసుకతో వ్యాపారం చేయాలని చూస్తే చర్యలు

ఉచిత ఇసుక అందరికి అందాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కర్నూలులో తన కార్యాలయం వద్ద మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. ఇసుక ఉచితంగా అందరికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి ఇసుకను ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లవచ్చన్నారు. గ్రూపులుగా ఏర్పడి ఇసుకతో వ్యాపారం చేయాలని చూస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్