పార్వతీపురం మున్సిపాలిటీలో వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సోమవారం గ్రీవెన్స్ లో ఆర్డీవో హేమలతకు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు వినతిపత్రం అందజేసారు. పోలీస్ స్టేషన్ వీధి నుండి దేవాంగుల వీధి వరకు గల ప్రాంతం, వై. కె. ఎం. కాలనీలో వీధిలైట్లు వెలగక చీకటిమయం కావడంతో దొంగతనాలకు, కుక్కలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.