గిరిజనులు అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేయాలని వైద్యశాఖ మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి టి. జగన్‌మోహనరావు సూచించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఇరిడి, లిక్కిడి, మండ, పి. ఆమిటి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. గ్రామాల్లో ఆరోగ్య సర్వేలు ఏమేరకు చేపడుతున్నారు, వ్యాధులను గుర్తించడం, చికిత్స, నివారణకు చర్యలు, తదితర అంశాలపై సిబ్బందిని ఆరాతీశారు. ఆరోగ్య సర్వే రికార్డులు పరిశీలించారు.