మదనపల్లెలో కిలో టమాటా రూ.80

తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దదైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది. గత వారం రోజులుగా ఇక్కడ ధర అత్యల్పంగా కిలో రూ.41 నుంచి అత్యధికంగా రూ.64 ఉంది. సోమవారం మాత్రం ఏ గ్రేడ్ కిలో రూ.69 నుంచి రూ.80 వరకు, బీ గ్రేడ్ రూ.50 నుంచి రూ.68 వరకు ధర పలికింది. మార్కెట్‌కు రోజూ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు సరకును రైతులు తీసుకొస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్