పాతబస్తీ పరిధి మీర్ చౌక్ లో స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్ పాతబస్తీ పరిధి మీర్ చౌక్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీర్ చౌక్ లో బీజేపీ, ఎంఐఎం ఎంపీ అభ్యర్థులు ఎదురుపడ్డారు. మీర్ చౌక్ గల్లీలో మాధవీలత, అసదుద్దీన్ వాహనాలు తారసపడ్డాయి. దీంతో నినాదాలతో బీజేపీ, ఎంఐఎం శ్రేణులు రెచ్చిపోయారు. ఇద్దరు నేతల వాహనాలను అడ్డుకునేందుకు యువకులు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు అసదుద్దీన్, మాధవీలత కార్లను అక్కడి నుంచి పంపించారు.

సంబంధిత పోస్ట్