హైదరాబాద్‌లో విలేకర్లతో హీరోయిన్ అంజలి మాట్లాడుతూ 'గేమ్ ఛేంజర్‌లో నేను కీ రోల్‌కే పరిమితం కాదు, నేను కూడా ఒక హీరోయిన్. ఈ సినిమాలో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తానని మేకర్స్ ప్రకటించలేదు కదా.. నా పాత్రకు సంబంధించి ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఓ అందమైన పాట ఉంటాయి. ఇంతకుమించి ఏం చెప్పలేను. ఇక విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో తాను రత్నమాలగా కనిపిస్తానని, అదొక విభిన్నమైన పాత్ర' అని తెలిపారు.