తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన పర్యాటకులపై తేనెటీగలు దాడి చేశాయి. ఆదివారం తాజ్‌మహల్‌ను చూసేందుకు భారీ సంఖ్యలు పర్యాటకులు వచ్చారు. అయితే ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో గానీ తేనెటీగలు అందరిపై దాడి చేశాయి. దీంతో పర్యాటకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.