బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ముంబైలో ఇప్పటికే అరడజను పైగా ఇళ్లను కొనుగోలు చేశారు. తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని పలిహలి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ను కొన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.9.75 కోట్లు అని, జూన్ 25నే దీని కొనుగోలు పూర్తయిందని తెలుస్తోంది.