UGC-NET పరీక్ష రద్దు

కేంద్ర విద్యా శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీకి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై త్వరలో సీబీఐ విచారణకు ఆదేశించనున్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు గానూ మంగళవారం నిర్వహించిన ఈ పరీక్షకు 9,08,580 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్