నదిలో కారు బోల్తా.. ఇద్దరు స్పాట్ డెడ్(వీడియో)

ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమ్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 24పై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ గోన్‌ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్