చైనా అమ్మాయిలు కృత్రిమ మేధ (ఏఐ) బాయ్‌ఫ్రెండ్స్ వెంటపడుతున్నారు. సామాన్య బాయ్‌ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు కసురుకుంటారని, ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ అయితే నిరంతరం తమకు వెన్నుదన్నుగా ఉంటారని చెప్తున్నారు. రొమాంటిక్ సంభాషణలకైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అంటున్నారు. వీరంతా ‘గ్లో’ అనే చాట్‌బాట్‌ను డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను ఎంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు.