TG: హైదరాబాద్‌లో మరోసారి బిర్యానిలో బొద్దింకలు కంటపడిన ఘటన కలకలం రేపుతోంది. నెక్లెస్ రోడ్డులోని రైల్ కోచ్ రెస్టారెంట్‌లో బిర్యానిలో బొద్దింకలు వచ్చినట్లు తెలుస్తోంది. బిర్యాని తినడానికి విజయ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లారు. సగం బిర్యాని తిన్న తర్వాత అందులో బొద్దింక వారు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.