బాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజస్థాన్‌లో చాలా ఏళ్లుగా అక్షయ తృతీయ (అఖా తీజ్), పీపాల్ పూర్ణిమ పండుగల సందర్భాల్లో బాల్య వివాహాలు జరుగుతాయి.