కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవర'. ఈ మూవీ షూటింగ్లో సైఫ్ అలీఖాన్‌కు గాయం కావటంతో తాత్కలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 5న దేవర విడుదల కష్టమని సినీ వర్గాలు చెబుతున్నాయి. సైఫ్ కొలుకోని సెట్స్ వచ్చే వరకూ ఆయన పాత్ర చిత్రీకరణ కుదరదని, షూటింగ్ షెడ్యూల్లో కూడా మార్పులొస్తాయంటున్నాయి. కాగా, దీనిపై దేవర టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.