హెల్మెట్‌ను మింగేసిన ఏనుగు (వీడియో)

ఓ ఏనుగు నిమ్మపండు అనుకుందో ఏమో ఏకంగా హెల్మెట్‌నే లటుక్కున మింగేసింది. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. గౌహతిలోని సత్‌గావ్‌ ఆర్మీ క్యాంప్‌లోకి ఓ ఏనుగు ప్రవేశించింది. లోనికి వెళ్తూ రోడ్డు పక్కన పార్క్‌ చేసి ఉన్న బైక్‌ మీద ఉన్న హెల్మెట్‌ను చూసింది. తొండంతో తీసుకుని నోట్లో వేసుకుని వెళ్లిపోయింది. కానీ ఆ హెల్మెట్‌ను ఏనుగు పూర్తిగా మింగిదో లేదో తెలియదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్