విజేత కోల్‌కతాకు రూ.20 కోట్లు, రన్నరప్ హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు దక్కింది. ప్రోత్సాహకంగా రూ. 50 లక్షల నగదు లభించింది. ఈ అవార్డును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వరి నాథ్ నుంచి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అందుకున్నారు.