బాలానగర్: పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ యువతిపై వ్యక్తి దాడి

పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ యువతిపై వ్యక్తి దాడికి దిగిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. యువతి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గుప్రాన్ అనే వ్యక్తి మూడేళ్లుగా పెళ్లి చేసుకోవాలని సామ్రీన్ అనే యువతి వెంట పడుతున్నాడు. యువతి నిరాకరిస్తూ వస్తుండడంతో కోపం పెంచుకున్న వ్యక్తి రాత్రి యువతిపై దాడికి దిగాడు. ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదని బాధితురాలి కుటుంబీకులు వాపోయారు.

సంబంధిత పోస్ట్