హైదరాబాద్ బండ్లగూడ పీఎస్ పరిధిలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను వివాహమాడిన సోహెల్ అనే యువకుడు ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అమ్మాయి కుటుంబ సభ్యులు 'కొడుకు పుట్టాడు వచ్చి చూడవా' అంటూ ఇంటికి పిలిపించి గదిలో నిర్బంధించి నానా చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు వాపోయాడు. సోహెల్ పోలీసులకు వీడియో కాల్ చేయడంతో రక్షించి ఆస్పత్రికి తరలించారు.