యూపీలోని కాన్పూర్లోని తాజాగా విషాద ఘటన జరిగింది. ఘంటాఘర్ కూడలిలో హీట్ స్ట్రోక్తో హెడ్ కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని తోటి పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా వీడియోలు తీస్తున్నారు. ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో, GRP ఇన్స్పెక్టర్ అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.