సోమవారం ప్రజావాణి రద్దు : జగిత్యాల కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 26న అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కొత్త కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు సర్వే నేపథ్యంలో జిల్లా అధికారులందతా క్షేత్రస్థాయి పరిశీలనలో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దైందన్నారు.

సంబంధిత పోస్ట్