విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట TVAC JAC ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఆర్టిజన్ కన్వర్షన్ చేయడం ద్వారా సంస్థకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఇందులో రవీందర్ర్ రెడ్డి, తిరుపతి, రమేష్, శ్రీనివాస్, రాజు, సంతోష్, లక్ష్మీనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు.