భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. తన కంటే బుమ్రా అద్భుతమైన బౌలర్ ఉన్నాడని అభివర్ణించారు. టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా బౌలింగ్‌ను చూస్తుంటే చాలా ముచ్చటేసిందన్నారు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని అభినందించారు. ప్రస్తుత జట్టుపైనా ప్రశంసల వర్షం కురిపించారు. నాణ్యమైన క్రికెట్ ఆడటంతోపాటు ఫిట్నెస్ విషయంలో చాలా ముందున్నారని పేర్కొన్నారు.