రూ. 25 లక్షల విలువైన స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లకు నష్టం

భారీవర్షాలతో ఖమ్మం సర్కిల్ పరిధిలో రూ. 25లక్షల విలువైన 80 విద్యుత్ స్తంభాలు, 25 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జల దిగబ్బంధంలో ఉన్న సబ్ స్టేషన్లలో జనరేటర్లు, యంత్రాల పనితీరును గుర్తించిన తర్వాత నష్టంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. పలు సబ్ స్టేషన్ల పరిధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎస్ఈ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యామని తెలిపారు.

సంబంధిత పోస్ట్