దుకాణ యజమానులు నిబంధనలు పాటించాలి

ఎరువులు విత్తన దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని వ్యవసాయ అధికారి సరిత అన్నారు. శుక్రవారం హలియాలోని పలు ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి నాణ్యత, ధరల విషయంలో అక్రమాలకు పాల్పడితే దుకాణాల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొనుగోలు దారులకు ఖచ్చితంగా రసీదు ఇవ్వాలని దుకాణ యజమానులకు సూచించారు.

సంబంధిత పోస్ట్