ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న కనీసం విద్యారంగపై చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణలో మద్యానికి మంత్రి ఉన్నాడు గాని విద్యారంగానికి మంత్రిని కేటాయించుకోలేని దుస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రేమించిందని పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన తండ్రి