తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ రిలీజ్ అయింది. జూన్ 12 నుంచి స్కూల్స్ ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్ సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 28 ఫిబ్రవరి 2025 లోపు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు.. 2025 మార్చిలో 10th ఫైనల్ పరీక్షలు ఉండనున్నాయి.