ఇటీవల సచినే స్వయంగా ఓ అభిమానిని కలిశాడు. తన స్నేహితునితో కలిసి కారులో వెళ్తున్న సచిన్ ముంబయి ఇండియన్స్ జెర్సీ ధరించి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని చూశాడు. అతడి జెర్సీ వెనక ‘టెండుల్కర్ 10 ఐ మిస్ యూ’ అని రాసి ఉంది. సచిన్ కారు ఆపి విమానాశ్రయానికి ఎలా వెళ్లాలని అతడిని అడిగాడు. సచిన్‌ని చూసి ఆ అభిమాని ఆనందంలో మునిగిపోయాడు. తన చేతిపై ఉన్న టాటూని, కొన్ని అరుదైన ఫొటోలను సచిన్ కు చూపించాడు. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అయ్యింది.