జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో చాంపియన్షిప్లో సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో పసికూన జార్జియా చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. గురువారం ఉత్కంఠ రేపిన గ్రూప్ దశ మ్యాచ్లో 74వ ర్యాంకర్ జార్జియా జోరు ముందు క్రిస్టియానో రొనాల్డో బృందం నిలవలేకపోయింది. ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తుల ముందు తలొంచిన రొనాల్డో సేన 2-0తో పరాజయం పాలైంది. రొనాల్డో ఈ మ్యాచ్లో ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం గమనార్హం.