ఢిల్లీలోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల సంఘటన కలకలం రేపింది. కాల్పుల శబ్దానికి అక్కడున్న కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఒక కస్టమర్ హత్యకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాల్పుల్లో మరణించిన 26 ఏళ్ల వ్యక్తిని హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన అమన్ జూన్గా గుర్తించారు. బర్గర్ కింగ్‌లో అతడితో పాటు కూర్చొన్న మహిళ పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.