హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి గురువారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాల వల్ల పదేండ్ల కాలంలో ఎంత నష్టపోయామో ప్రజలకు తెలియజేయాలని కోరారు.