సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మహిళా అభ్యున్నతికి ఇందిరా శక్తి క్యాంటీన్ ఎంతో దోహదపడతాయని ఈ క్యాంటీల ద్వారా మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంటీన్ నిర్వహకులు బొమ్మగాని సునీత, హరిబాబు, మ్యకల అశోక్, నిర్మల, సంపత్, రాజు, బైరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.