హుస్నాబాద్: డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల నిధులు మంజూరు

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మీదుగా రామవరం గ్రామం వరకు నిర్మించనున్న డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఐఎఫ్ నిధులు రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. మూలమలుపులు లేకుండా నాణ్యతతో కూడిన రోడ్డును నిర్మించనున్నామన్నారు.

సంబంధిత పోస్ట్