చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. నవాబుపేట గ్రామంలో రూ. 20 లక్షల పంచాయతీరాజ్ భవనం, రూ. 10 లక్షలతో నూతన రజక భవనం, రూ. 10 లక్షలతో నిర్మించిన యాదవ సంఘ నూతన భవనం, ముదిమాణిక్యం గ్రామంలో రూ. 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.