హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ ను గత నెల రోజులనుంచి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం స్టడీ అవర్కు హాజరయ్యే విద్యార్థులకు ఆకలి నుంచి ఉపశమనానికి గాను కళాశాల ఉపాధ్యాయుల ఆర్థిక సహాకారంతో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు ప్రిన్సిపల్ అంజనేయరావు అల్పాహారం అందజేశారు.