వేములవాడ: శనివారం రాజన్న ఆలయంలో ఇదీ పరిస్థితి

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సెలవు దినం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తజనం స్వామి వారికి ప్రీతికరమైన కోడె మొక్కులతో పాటు కుంకుమార్చన పూజలు స్వామి వారికి సమర్పించి, స్వామి వారి సేవలో  తరించారు. స్వామి వారి ధర్మ దర్శనంలో ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్