సంక్రాంతి పర్వదినం అనగానే మనకు పిండివంటలతో పాటు రంగురంగుల ప్రత్యేకమైన ముగ్గులు గుర్తుకొస్తాయి. అయితే వేములవాడ పట్టణ కొందరు మహిళా మణులైతే భక్తి భావంతో రామ మందిర్, కోడి పందేలు, హరిదాసుల ప్రత్యేకంగా పండుగలో ముఖ్యమైన విశేషాలను ముగ్గుల రూపంలో మంగళవారం వేశారు. దీంతో ఈ ముగ్గులు స్పెషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ప్రతి ఆడపడుచు సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో వాకిట్లో ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెట్టారు.