థాయ్‌లాండ్‌లోని రేయోంగ్ అనే ప్రాంతంలో ఇటీవల ఊహించని ఘటన జరిగింది. ఓ యువకుడు ఎప్పటిలాగే రాత్రి తన రూమ్‌లో పడుకున్నాడు. ఆ యువకుడు గాఢ నిద్రలో ఉండగా అతడి డ్రాయర్లో ఓ పాము దూరింది. దీంతో ఆ యువకుడిని మెలకువ వచ్చింది. భయంతో ఆ యువకుడు గట్టిగా కేకలు పెట్టాడు. ఇంట్లో వారు అక్కడికి వచ్చి, స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. స్నేక్ క్యాచర్ ఆ పామును చాలా నేర్పుతో బంధించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.