ఇటీవల కాలంలో యువత దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. రోడ్ల మీద, వాహనాల్లో వెళ్లే వారిమీద దొంగల కళ్ళు బాగా పడుతున్నాయి. అయితే, తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో ఓ వ్యక్తి బస్సు ఎక్కుతున్న మహిళ ఫోన్ లాక్కొని పారిపోతున్న స్నాచర్ని జనం పట్టుకున్నారు. ఈ ఘటన తుగ్లకాబాద్ మెట్రోస్టేషన్ బస్టాండ్ లో చోటుచేసుకుంది.