యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వారి మరణం కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటని వారు దేశానికి పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. భారతదేశానికి రెండు సార్లు ప్రధానిగా, రిజర్వ్ బ్యాంక్ కు గవర్నర్ గా వారు చేసిన సేవలు వెలకట్టలేనివని గుర్తు చేశారు.