ఢిల్లీలోని ఎన్సిఆర్ పరిధిలో గురువారం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 88 ఏళ్ల తర్వాత ఢిల్లీలో రికార్డు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రహదారులు జలమయమవడంతో.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ వర్షాలు తీవ్రమైన వేడి నుండి ఉపశమనం కలిగించాయి.