యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మధ్య ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. 6 బోగీలకు మంటలు వ్యాపించి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు ప్రమాదాన్ని పసిగట్టి రైలును ఆపి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే వందల మంది అగ్గిపాలయ్యేవారు. ప్రస్తుతం మంటలు భారీగా వ్యాపిస్తుండగా అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.