ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కొసం మరో కొత్త రీఛార్జి ప్లాన్ ను తీసుకొచ్చింది. వీఐ కొత్తగా తీసుకొచ్చిన రూ.904 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2జీబీ డేటా అంటే మొత్తం 180జీబీ డేటా ఈ ప్లాన్ తో లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 90 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.